TS news: 16 నుంచి రైతు ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము

రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,006 కోట్లు జమ చేయనున్నట్లు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రూ.50 వేల వరకు రుణమాఫీ పూర్తి చేయాలని

Updated : 06 Aug 2021 20:23 IST

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,006 కోట్లు జమ చేయనున్నట్లు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. రూ.50 వేల వరకు రుణమాఫీ పూర్తి చేయాలని ఇటీవల కేబినెట్‌ నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకర్లతో మంత్రులు సమావేశమయ్యారు. రుణమాఫీ అమలు, రైతుల ఖాతాల్లో నగదు జమ సంబంధిత అంశాలపై చర్చించారు. ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు. రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకర్లు ఇతర ఖాతా కింద జమ చేయవద్దని, పూర్తిగా రుణమాఫీ ఖాతాలోనే జమ చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని