Chandrababu: రాజమహేంద్రవరం బయల్దేరిన అమరావతి రైతులు.. మార్గంమధ్యలో అడ్డుకున్న పోలీసులు

తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిసేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు. అయితే మార్గంమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Updated : 03 Oct 2023 11:45 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణిని కలిసేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాజమహేంద్రవరం బయల్దేరి వెళ్లారు. అయితే మార్గంమధ్యలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, వెలగపూడికి చెందిన రైతులు ప్రత్యేక బస్సులు, సొంత వాహనాల్లో పయనమయ్యారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబును వైకాపా ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టిందని.. ఇలాంటి సమయంలో తామంతా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని రైతులు చెప్పారు.

రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి లేదంటూ వీరవల్లి, నల్లజర్ల టోల్‌గేట్ల వద్ద రైతుల బస్సులను పోలీసులు నిలిపేశారు. బస్సు డ్రైవర్‌లను బలవంతంగా దించేశారు. ఈక్రమంలో పోలీసులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం వెళ్లేందుకు అనుమతి ఎందుకని ప్రశ్నించారు. తామేమీ పాకిస్థాన్‌ నుంచి రాలేదని మహిళలు ఆక్రోశించారు. తాము ఎట్టిపరిస్థితిలోనూ రాజమహేంద్రవరం వెళ్లి తీరతామని రైతులు తేల్చిచెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని