Amaravati: తిరుమలకు బస్సుల్లో బయల్దేరిన అమరావతి ప్రాంత రైతులు

తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయల్దేరారు.

Published : 03 Jul 2024 12:55 IST

తుళ్లూరు: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రాజధాని అమరావతి ప్రాంత రైతులు బయల్దేరారు. రాజధాని ఉద్యమం విజయం సాధించడం, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎం కావడంతో మొక్కులు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. రైతులు, మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో బయల్దేరి తిరుమలకు వెళ్లారు. ఈ బస్సులను తెదేపా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందేలా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటుందన్నారు. ప్రజలందరి సలహాలు, సూచనలతో అద్భుతంగా ప్రజారాజధాని నిర్మాణం చేస్తారని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని