Amaravati: సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు.

Published : 13 Jun 2024 16:15 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. గురువారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయల్దేరిన చంద్రబాబుకు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్‌ సాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు