CM Jagan: సీఎం జగన్‌కు నిరసన సెగ.. కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతుల యత్నం

అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు.

Updated : 26 Apr 2023 19:26 IST

ధర్మవరం: అనంతపురం జిల్లాలో సీఎం జగన్‌కు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. సింగనమల నియోజకవర్గం పరిధిలోని నార్పలలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని సీఎం జగన్‌ రోడ్డు మార్గంలో పుట్టపర్తి వెళ్తుండగా.. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రైతులను పక్కకు లాగేయడంతో సీఎం కాన్వాయ్‌ ముందుకు సాగింది.

పేదలకు ఇళ్ల స్థలాల కోసమంటూ తుంపర్తి, మోటుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు.. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని రైతులు వాపోయారు. పరిహారం ఇప్పించడంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని తీవ్ర ఆవేదన చెందారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే పోలీసులు తోసేశారని  వాపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని