Kamareddy: దిష్టిబొమ్మకు వినతిపత్రం.. రేపు కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చిన రైతులు

కామారెడ్డిలో నూతన మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం పట్టణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

Updated : 05 Jan 2023 20:45 IST

కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌ వద్ద 8 గంటలుగా  కొనసాగించిన ఆందోళనను రైతులు తాత్కాలికంగా విరమించారు. ఇవాళ ఉదయం నుంచి ధర్నా చేసిన రైతులు కలెక్టరేట్‌ వద్ద దిష్టిబొమ్మకు వినతిపత్రం ఇచ్చి గేటుకు వేలాడదీశారు. శుక్రవారం కామారెడ్డి  పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపటి నుంచి భవిష్యత్‌ కార్యాచరణ మొదలవుతుందని రైతు జేఏసీ నేతలు తెలిపారు. కలెక్టర్‌ వచ్చి వినతిపత్రం తీసుకోవాలని వేలాది మంది రైతులు కోరినా .. ఆయన బయటకు రాలేదని రైతు సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

రైతులతో మాట్లాడేందుకు సిద్ధమే: కలెక్టర్‌

రైతులతో మాట్లాడేందుకు సిద్ధమేనని  కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ తెలిపారు. రైతు ప్రతినిధులు వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. రైతులు లేవనెత్తిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రైతుల తరఫున 10మంది వచ్చి వినతిపత్రం ఇవ్వవచ్చన్నారు. రైతుల అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. ఇండస్ట్రియల్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇంకా ముసాయిదా  దశలోనే ఉందన్న కలెక్టర్‌... మాస్టర్‌ ప్లాన్‌పై రైతుల్లో కొందరు భయం సృష్టించారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని