Updated : 25 May 2022 16:43 IST

Farmers Protest: హనుమకొండ- హైదరాబాద్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

వరంగల్‌: భూసేకరణ జీవో 80ఏ రద్దు చేయాలంటూ వరంగల్‌ జిల్లా రైతులు కదం తొక్కారు. హనుమకొండ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. రైతుల నిరసనలో భాజపా, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. రైతుల నిరసనతో హనుమకొండ- హైదరాబాద్‌ హైవేపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

అంతకముందు ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. జీవో 80ఏ రద్దు చేయాలని డిమాండ్‌తో జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి రైతులను అరెస్ట్‌ చేసి పీఎస్‌లకు తరలించారు. రైతుల అరెస్టులను రైతు ఐక్య కార్యాచరణ సమితి ఖండించింది. రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలిపేందుకు యత్నించిన రైతులను అరెస్ట్‌ చేయడాన్ని వివిధ రాజకీయ నేతలు తప్పుబట్టారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని