
Updated : 11 Oct 2021 19:13 IST
Festival mela: నాంపల్లిలో ఫెస్టివల్ మేళా ప్రారంభం
హైదరాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో ఫెస్టివల్ మేళా ప్రారంభమైంది. ఈ మేళాను తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఈ నెల 31వరకు ఈ ఫెస్టివల్ మేళా కొనసాగనుంది. దీంట్లో 300 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ వెల్లడించింది. ఈ ఏడాదీ నుమాయిష్ లేనందున ఫెస్టివల్ మేళా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చిన్న పరిశ్రమలు, చేతివృత్తుల వారికి అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. మేళాలో హ్యాండ్లూమ్, కశ్మీర్ ,రాజస్థానీ వస్త్రాలు, ఫుడ్ కోర్టులు, కిడ్స్ గేమ్స్ ఉంటాయని సొసైటీ తెలిపింది.
ఇవీ చదవండి
Tags :