
చలి చంపేస్తోందా.. టీ, కాఫీల్లో ఇవీ ట్రై చేయండి!
ఇంటర్నెట్ డెస్క్: చలికాలంలో దాదాపు అందరూ కోరుకునే వాటిల్లో ఉండేవి వేడి వేడి టీ, కాఫీ. శీతాకాలంలో మనల్ని ఉత్తేజంగా ఉంచేందుకు ఇవి ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. అయితే, మీ టీ, కాఫీలో కొన్ని పదార్థాలు వాడటం ద్వారా ఒంట్లో వేడి పెంచుకొని ఆరోగ్యంగా ఉండొచ్చని పలువురు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దామా..!
దాల్చిన చెక్క: చలికాలంలో టీ, కాఫీలను సర్వ్ చేసే ముందు కొద్దిగా దాల్చిన చెక్క లేదా దాని పొడిని కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్కతో మంచి సువాసనతో కూడిన తేనీటిని ఆస్వాదించమే కాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.
అల్లం: చలికాలంలో శక్తినిచ్చే పదార్థాల్లో అల్లం కూడా ఒకటి. టీ, కాఫీల్లో అల్లం మరిగించి తీసుకుంటే శరీరానికి రెట్టించే ఉత్సాహం కలుగుతుంది. పైగా మార్కెట్లో ఇది చౌకగా లభిస్తుంది.
పుదీనా, చాక్లెట్: టీ, కాఫీల్లో కొన్ని పుదీనా ఆకులను కలిపి తాగడం చలికాలంలో మరీ మంచిది. వీటితో పాటే ఓ చాక్లెట్ ముక్కను కాఫీలో కలిపి తీసుకోవడం ద్వారా చలికాలంలో వెచ్చగా ఉండొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.