Hotel: పాడైపోయిన మటన్‌తో బిర్యానీ.. ఆల్ఫా హోటల్‌కు జరిమానా

రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు.

Updated : 20 Jun 2024 15:30 IST

సికింద్రాబాద్‌: రెండు రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌లో ఆహార భద్రత టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నేడు వెల్లడించారు. హోటల్‌లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని పేర్కొన్నారు. పాడైపోయిన మటన్‌తో బిర్యానీ చేసినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఆహారం వేడి చేసి ఇస్తున్నట్లు తెలిపారు. నాసిరకం వస్తువుల ఉపయోగంతో పాటు కిచెన్‌ దుర్గంధంగా ఉన్నట్లు చెప్పారు. డేట్‌, బ్యాచ్‌ నంబర్‌ లేకుండా  బ్రెడ్‌, ఐసీక్రీమ్‌ ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో హోటల్‌కు టాస్క్‌ఫోర్స్‌ నోటీసులు జారీ చేసింది. రూ.లక్ష జరిమానా విధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు