SriKalahasti: ముక్కంటి ఆలయానికి సమీపంలోని కైలాసగిరిలో అగ్ని ప్రమాదం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న కైలాసగిరిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న కైలాసగిరిలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కొండలపై ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తుఫాన్ నగర్, భరద్వాజ తీర్థం సమీపంలోని కాలనీ వాసులు, ఆలయ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కొండ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమించారు. డీఎస్పీ భీమారావు, ఆలయ పాలకమండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. నెలన్నర రోజుల క్రితం ఇదే అటవీ ప్రాంతంలో దాదాపు 50 ఎకరాలు వన సంపద కాలి బూడిదయింది. తాజాగా గురువారం మళ్లీ మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భరద్వాజ గిరిజన కాలనీ వైపు మంటలు ఎగసిపడకుండా నివారణ చర్యలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ
-
రోజుకు నాలుగు గంటలు ఫోన్లోనే.. పిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం
-
Hyderabad: వర్షంలోనూ కొనసాగుతోన్న గణేశ్ నిమజ్జనాలు
-
ISRO Chief: సోమనాథ్ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ పూజలు
-
Chandramukhi 2 Review: రివ్యూ: చంద్రముఖి-2