Updated : 01/04/2021 17:23 IST

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని ఎన్టీఆర్‌ స్టేడియంలో యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘గో మహాగర్జన’లో అపశ్రుతి చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం జరగడంతో వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్‌సర్క్యూట్‌తో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మూడు గుడారాలు కూడా కాలిపోయాయి. 

వేదిక వద్దకు పోలీసులు, యుగతులసి సభ్యులు, వాలంటీర్లు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాసేపట్లో సభ ప్రారంభం కానుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని