Fire Accident: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం

ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ షెడ్డులోని పత్తి బస్తాలకు మంటలు అంటుకొని పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.

Updated : 10 Jun 2023 14:42 IST

ఖమ్మం: ఖమ్మం పత్తి మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో నిల్వకు ఉంచిన పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో షెడ్డులో ఉన్న దాదాపు 1600 పత్తి బస్తాలన్నీ కాలిపోయినట్లు తెలుస్తోంది. పక్క షెడ్డులోని బస్తాలకు కూడా మంటలు వ్యాపించే క్రమంలో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న వ్యాపారికి సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని