Published : 23 Jun 2022 12:05 IST

Andhra News: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద మంటలు

విజయవాడ: బెజవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్‌ కింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటలతోపాటు పేలుడు శబ్దం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడూ వీఐపీలు తిరిగే ఈ మార్గంలో మంటలు రావడంతో కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రైల్వే సిబ్బంది, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

ఫ్లైఓవర్‌ కింద ఇంటర్నెట్‌ కేబుళ్లకు సంబంధించిన పనులు చేస్తుండగా రైళ్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగలడంతో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. దీని వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటర్నెట్‌ కేబుళ్లు లాగిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts