Burning Wounds: కాలిన గాయాలయ్యాయా..? ఏం చేయాలో తెలుసా..!

అగ్ని ప్రమాదంలో శరీరంలోని ఏదైనా భాగం కాలితే ఏం చేస్తాం..? సిరా, సబ్బు నురుగు, ఏదైనా మందు రాస్తాం. కానీ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదాలే కాదు..ఇంట్లో జరిగే చిన్న ప్రమాదాలకు కూడా సొంత వైద్యం చేస్తారు.

Updated : 13 Aug 2022 12:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ని ప్రమాదంలో శరీరంలోని ఏదైనా భాగం కాలితే ఏం చేస్తాం..? సిరా, సబ్బు నురుగు, ఏదైనా మందు రాస్తాం. కానీ అలా చేయొద్దని వైద్యులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదాలే కాదు.. ఇంట్లో జరిగే చిన్న ప్రమాదాలకు కూడా సొంత వైద్యం చేస్తారు. ఇలాంటి ప్రమాదాల్లో చేయాల్సిన పనులేవీ..? చేయకూడని అంశాలేవో నిపుణులు సూచించారు.

కాలిన గాయాలు శారీరకంగానే కాదు.. మానసికంగా మనిషిని కుంగదీస్తాయి. కాలిన గాయాల తీరు, స్వభావాన్ని బట్టి ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు ప్రథమ చికిత్స అందించాలి.

మంటల్లో మనిషి ఉంటే వెంటనే పక్కకు తొలగించాలి. మందపాటి దుప్పటి కప్పడంతో మంటలను ఆర్పేందుకు వీలవుతుంది.

కాలిన భాగంలో దుస్తులు, నగలను తీసేయాలి. గాయాలయిన చోట చల్లని లేదా గోరు వెచ్చని నీటిని 10-30 నిమిషాల పాటు పోయాలి. 

దెబ్బతిన్న చోట చర్మానికి తగలకుండా తెల్లని వస్త్రాన్ని కట్టాలి. ఆ తర్వాత వీలయినంత తొందరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. 

ఐస్‌, ఐస్‌ నీళ్లతో కాలిన గాయాలను తుడవద్దు. గాయాలకు క్రీం, వెన్న పెట్టకూడదు.

కాలిన గాయాలపై సిరా పోయొద్దు. బొబ్బలొస్తే చిదిమేయడం మంచిది కాదు.

ప్రమాదంలో గాయ పడిన వ్యక్తి ప్రశాంతంగా ఉండేలా చూడాలి. ఎక్కువ మంది ఉంటే గందరగోళ పరిచే అవకాశాలుంటాయి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని