Health: ఆహారం కలుషితమై వాంతులు, విరేచనాలా..? అయితే ఇలా చేయండి..!

ఆహారం బలవర్ధకంగా ఉండాలి..అలాంటి ఆహారం ప్రాణాంతకంగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలను తీస్తాయి. 

Published : 30 Jun 2022 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనం తినే ఆహారం బలవర్ధకంగా ఉండాలి. అలాంటి ఆహారం ప్రాణాంతకంగా మారితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలనూ తీస్తాయి. ఇలాంటి పరిస్థితిని చేజేతులా మనమే కొని తెచ్చుకుంటాం. వారాంతంలో రెస్టారెంటుకు వెళ్లాలనుకోవడం.. బజారులో లభించే ఛాట్‌ లాంటివి తినడం మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వర్షకాలంలో తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాతే ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయించాలి. అది కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే సగం ఇబ్బందులను అధిగమించినట్లు అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

కలుషితం అయితే: మనం తినే ఆహారం సరిగా ఉడకకపోయినా.. సరిగా నిల్వ చేయకపోయినా కలుషితం అవుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, ఆజీర్తి, పొట్ట ఉబ్బరం తలెత్తుతుంది. మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇతర నూనె పదార్థాల కారణంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 

ఏం చేస్తే బాగుంటుంది: ఆహారం కలుషితం అయినప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పొట్టలో ఇబ్బందులు తగ్గే వరకు పళ్ల రసాలను తీసుకోవాలి. నిమ్మరసం, పుదీనా జ్యూస్‌ తీసుకోవడంతో మంచి ఫలితం ఉంటుంది. తురిమిన అల్లం, కాస్తంత జీలకర్ర పొడిని మజ్జిగలో కలుపుకొని తరచుగా తాగాలి. దానిమ్మ గింజలకు పొట్టలోని బాధలను తగ్గించే గుణముంది. పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా మగ్గిన అరటిపండును తినడం మంచిదే. తులసి, బ్లాక్‌ టీ తాగడంతో కూడా ఫలితం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకూ నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. వాంతులు, విరేచనాల తీవ్రత అధికంగా ఉంటే వైద్యుల దగ్గరికి వెళ్లాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని