Habibganj: ఆధునిక హంగులతో.. 5స్టార్ రైల్వేస్టేషన్

దేశంలో మొట్టమొదటిసారి ఓ రైల్వేస్టేషన్‌కు GEM 5స్టార్‌ రేటింగ్‌ లభించింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ గ్రీన్‌ ఎకోఫ్రెండ్లీ మూమెంట్‌ (GEM) 5స్టార్‌ రేటింగ్‌ అందుకుని.. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైల్వేస్టేషన్‌గా నిలిచింది.  

Updated : 08 Sep 2021 04:57 IST

భోపాల్‌: దేశంలో మొట్టమొదటిసారి ఓ రైల్వేస్టేషన్‌కు GEM 5స్టార్‌ రేటింగ్‌ లభించింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ గ్రీన్‌ ఎకోఫ్రెండ్లీ మూమెంట్‌ (GEM) 5స్టార్‌ రేటింగ్‌ అందుకుని.. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైల్వేస్టేషన్‌గా నిలిచింది. దేశంలోని రైల్వేస్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ చర్యల్లో భాగంగానే హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌లో పచ్చదనం ఫరిడవిల్లేలా రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. అత్యాధినిక హంగులతోపాటు, పర్యావరణహిత (ఎకో ఫ్రెండ్లీ) వాతావరణాన్ని అభివృద్ధి చేసింది. రైల్వేశాఖ కృషిని గుర్తించిన అసోచామ్‌.. హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌కు GEM 5స్టార్‌ రేటింగ్‌ను అందించింది.

పర్యావరణహితం, పచ్చదనం, ప్లాస్టిక్‌ రహితం, స్థిరమైన డిజైన్‌ కలిగిన ఇళ్లు, పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆఫీసులు, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాజెక్టులకు అసోచామ్‌ GEM రేటింగ్‌లను అందిస్తోంది. పర్యావరణహితం అత్యద్భుతంగా ఉండే వాటిని అత్యధికంగా 5స్టార్‌ రేటింగ్‌ ఇస్తోంది. గ్రీన్‌ బిల్డింగ్‌ పరిమితుల్లో భాగంగా హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌లో తగిన ఏర్పాట్లు చేశారు.

హబీబ్‌గంజ్‌ రైల్వేస్టేషన్‌ ప్రత్యేకతలివీ..

* ఈ రైల్వేస్టేషన్‌లో వినియోగించే విద్యుత్తులో 70 శాతం సౌర శక్తి ద్వారా ఉత్పత్తి చేసిందే.

* స్టేషన్‌తో పాటు పరిసరాల్లో వర్షం నీటిని సేకరించి, వాటినే వినియోగిస్తున్నారు.

* STP ద్వారా వ్యర్థ జలాల నిర్వహణ. 100% వ్యర్థ జలాలను రీసైక్లింగ్‌ చేయడం.

* రైల్వేస్టేషన్‌ నిర్మాణంలో రీసైక్లింగ్‌  చేసిన స్టీల్‌, గ్లాస్‌, తేలికపాటి బూడిద ఇటుకలు, టైల్స్‌నే వినియోగించారు.

* రైల్వేస్టేషన్‌కు వేసిన రంగులలో రసాయనాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు వహించారు.

* రైల్వే స్టేషన్‌ నిర్మాణంలో కలపను తక్కువగా ఉపయోగించారు. 

* పార్కింగ్‌ ప్రాంతం సహా స్టేషన్ ఏరియాలో 100 శాతం సీసీటీవీ పర్యవేక్షణ. స్టేషన్‌లో మొత్తం 176 సీసీ కెమెరాలు అమర్చారు.

* స్టేషన్‌ను దివ్యాంగ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు. ఎంట్రీ ర్యాప్‌లు, లిఫ్ట్‌లు, టాయిలెట్లు దివ్యాంగులను అనువుగా ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని