అనగనగా ఓ చేప.. దాని పొట్టలో విస్కీ బాటిల్!
అనగనగా ఓ చేప.. దాని పొట్ట కోసి చూస్తే ఉంగరం దొరికిందంటూ చిన్నప్పుడు చందమామ కథల్లో చదివేవుంటాం. పాత సినిమాల్లోనూ ఇలాంటి దృశ్యాలు చూసే ఉంటాం. అయితే తాజాగా ఓ మత్స్యకారుడికి సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: అనగనగా ఓ చేప.. దాని పొట్ట కోసి చూస్తే ఉంగరం దొరికిందంటూ చిన్నప్పుడు చందమామ కథల్లో చదివేవుంటాం. పాత సినిమాల్లోనూ ఇలాంటి దృశ్యాలు చూసే ఉంటాం. అయితే తాజాగా ఓ మత్స్యకారుడికి సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. కానీ అతడికి దొరికింది ఉంగరం కాదు.. మూత తెరవని ఓ విస్కీ బాటిల్. చేప పొట్టలోంచి అతడు విస్కీ సీసా తీస్తూ రికార్డు చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఓ భారీ చేప దొరికింది. అతడు దానిని బల్లపై ఉంచి కోశాడు. చేప పొట్టలో ఏదో వస్తువు ఉన్నట్టు అనిపించడంతో ఆ భాగాన్ని కోసి చూశాడు. అందులో మూత తెరవని ఓ విస్కీ బాటిల్‌ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయగా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆ మత్స్యకారుడు ఎవరో.. ఏ సముద్రంలో వారికి ఆ చేప దొరికిందో వివరాలు మాత్రం తెలియరాలేదు.
తాజా వీడియోను చూసి పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి లోనవుతుంటే.. పర్యావరణ ప్రేమికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ.. ఆ వ్యర్థాలను సముద్రజలాల్లో విసిరి పారేయడం వల్ల జీవరాశికి కలుగుతున్న ముప్పును వారు మరోసారి గుర్తు చేశారు. ఎన్నో సముద్ర జీవులు ఆహారంగా భావించి ఇలాంటి వ్యర్థాలను మింగి ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!