Tamil Nadu: బూట్లు తడుస్తాయని.. భుజాలమీద కెక్కి..

ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం.

Published : 08 Jul 2021 18:07 IST

చెన్నై: ఎన్నికల్లో గెలిస్తే ప్రజల కోసం ఇది చేస్తాం.. అది చేస్తాం అంటూ ఓటర్ల చుట్టూ తిరిగే రాజకీయ నాయకులు పదవి వచ్చాక అధికార దర్పాన్ని ప్రదర్శించడం చాలా సార్లు చూసే ఉంటాం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ మంత్రి కూడా తన పదవితో వచ్చిన దర్పాన్ని ప్రదర్శించారు. నీళ్లలో తన కాళ్లు తడవకుండా ఉండేందుకు ఏకంగా మత్స్యకారుల భుజాలపైకెక్కి ఒడ్డుకు చేరారు. ఆయన్ను  మత్స్యకారులు మోసుకొస్తున్న దృశ్యాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌‌.. పాలవెర్కడులో కోతకు గురైన పముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి స్థానికులతో మాట్లాడారు. అనంతరం పడవలో కొద్దిసేపు ప్రయాణించారు. పడవ ఒడ్డుకు చేరగానే అందులోంచి మంత్రి కిందకు దిగేందుకు వీలుగా ఓ మత్స్యకారుడు కుర్చీని ఏర్పాటు చేశాడు. కానీ తన బూట్లు తడుస్తాయంటూ నీటిలోకి దిగేందుకు ఆయన నిరాకరించారు. చివరికి మత్స్యకారుల భుజాలెక్కి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అధికార దర్పాన్ని ప్రదర్శించిన మంత్రిని విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని