Dental treatment: దెబ్బతిన్న చిగుళ్లను బాగు చేసే ఫ్లాప్‌ సర్జరీ

చిగుళ్లు బలంగా ఉంటేనే దంతాలు గట్టిగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు ఇతరత్రా జబ్బులతో దంతాలు తొందరగా పాడవుతాయి. ఏ ఆహారం తీసుకున్నా ఇబ్బందిపడుతారు

Updated : 26 May 2022 15:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటేనే దంతాలు గట్టిగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు ఇతరత్రా సమస్యలతో దంతాలు తొందరగా పాడవుతాయి. ఈ సమస్యలు ఉంటే ఎటువంటి ఆహారం తీసుకున్నా ఇబ్బందిపడుతారు. పండ్లు, కాయగూరలు తినాలన్నా అవస్థ పడుతుంటారు. ఇలాంటి వారికి ఎన్ని మందులు ఇచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదు. తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తుంది. చిగుళ్లను బాగు చేసే చికిత్సను ఫ్లాప్‌సర్జరీ అంటారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సర్జరీ పూర్తి వివరాలను దంతవైద్యురాలు అన్నే నీలిమాదేవి తెలిపారు.

ఫ్లాప్‌ సర్జరీ ఎందుకు: పంటి మీద ఉండే ఫ్లాప్‌ తెరచి లోపల శుభ్రం చేసి అందులో ఇన్ఫెక్షన్‌ రాకుండా మళ్లీ ఎముక నిర్మితమయ్యే విధంగా చేసే దానినే ఫ్లాప్‌ సర్జరీ అంటాం. పంటి ఎముక అరిగిపోయినపుడు అది గట్టిగా ఉండదు. ఊడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది. పన్ను పటిష్ఠంగా ఉండేందుకు వీలుగానే ఈ చికిత్స చేస్తాం.

సర్జరీ ఎలా ఉంటుంది: ఫ్లాప్‌ సర్జరీ చేసే ముందు ఎంత వరకు ఎముక దెబ్బతిందో పరిశీలించాలి. మధుమేహం, బీపీ ఉన్నవాళ్లకు నియంత్రణలో ఉండాలి. రోగికి పూర్తి వివరాలు చెప్పి స్థానికంగా మత్తు మందు ఇచ్చి సర్జరీ చేస్తాం.

జాగ్రత్తలు ఏవీ: ఫ్లాప్‌ సర్జరీలో రక్తం కొంత పోతుంది. అంతకు ముందు వాడే మందులను దంతవైద్యులకు చూపించాలి. గుండె, రుమటైడ్‌ అర్థటైడ్‌ ఉన్నట్లయితే వైద్యులకు  వెల్లడించాలి. గర్భిణులకు క్లీనింగ్‌ తప్పా సర్జరీ చేయడానికి లేదు. ఫ్లాప్‌ సర్జరీ తర్వాత జంపింగ్‌ లాంటివి చేయొద్దు. సాధారణ పనులు చేసుకోవచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని