Health: పాడైన చిగుళ్లను బాగు చేసుకోవచ్చు..ఎలానో తెలుసా..?

చిగుళ్లు బలంగా ఉన్నపుడే పళ్లు బాగుంటాయి. కొంతమందిలో ఆహారపు అలవాట్లతో ఇన్‌ఫెక్షన్లు,ఇతరత్రా జబ్బుల కారణంతో చిగుళ్లు బాగా దెబ్బతింటాయి. 

Published : 29 Jun 2022 02:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిగుళ్లు బలంగా ఉన్నపుడే పళ్లు బాగుంటాయి. కొంతమందిలో ఆహారపు అలవాట్లతో ఇన్‌ఫెక్షన్లు,ఇతరత్రా జబ్బుల కారణంతో చిగుళ్లు బాగా దెబ్బతింటాయి. ఇలాంటి దానికి మందులతో ఉపయోగం ఉండదు. తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందే. ఈ సర్జరీని ఫ్లాప్‌ సర్జరీ అంటారు. ఈ సర్జరీకి సంబంధించిన పూర్తి వివరాలను అన్నే నీలిమాదేవి తెలిపారు.

సమస్య ఎందుకొస్తుందంటే: పంటి చుట్టూ ఉండే చర్మం దెబ్బతిని ఇబ్బంది పెడితే దానికి ఫ్లాప్‌ సర్జరీ చేయాల్సి వస్తుంది. పంటి మీదున్న ఫ్లాప్‌ను తెరిచి లోపలంతా శుభ్రం చేసి మళ్లీ సమస్య రాకుండా ఎముక పెరిగేలా చేస్తాం. పంటి ఎముక దెబ్బతిన్నపుడు కదలిక వస్తుంది. పన్ను ఊడిపోయే దశ వచ్చిన తర్వాత ఫ్లాప్‌ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఒకసారి సర్జరీ చేస్తే మళ్లీ సమస్య రాదు. పళ్లు గార పట్టినా కూడా సర్జరీతో సరి చేయడానికి వీలుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని