Rahul Gandhi: రాహుల్.. వైట్ఛాలెంజ్కు సిద్ధమా?: హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు
నగరంలో రాహుల్‌గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్, గన్‌పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వీటిని
హైదరాబాద్: నగరంలో రాహుల్‌గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్‌బండ్, గన్‌పార్క్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వీటిని ఏర్పాటు చేశారు. ఈ నెల 6, 7 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గతంలో వైట్ ఛాలెంజ్‌పై కాంగ్రెస్, తెరాస నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. హైదరాబాద్ సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం ఘటన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొనసాగింది.
ఆ సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు ‘వైట్ ఛాలెంజ్’ పేరిట సవాల్ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కేటీఆర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ సిద్ధమేనా అని.. ఆయన ఒప్పుకుంటే దిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలకు సిద్ధమని కేటీఆర్ ప్రతిసవాల్ విసిరిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ఇటీవల నేపాల్‌లోని ఓ పబ్‌లో కనిపించిన నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల చర్చనీయాంశంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్