Published : 04 Jul 2022 01:35 IST

Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’

క్యాబ్‌ సర్వీసు అధిక ఛార్జీలపై వ్యక్తి ట్వీట్‌

ముంబయి: క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం మరింత సులభతరమైంది. డిమాండ్‌ భారీగా పెరగడానికి తోడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలూ అధికమవ్వడంతో రైడ్‌ రేట్లు పెరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో.. ముఖ్యంగా వర్షాలు పడినప్పుడు ప్రయాణికుల నుంచి భారీగానే వసూలు చేస్తున్నాయి కొన్ని క్యాబ్‌ సర్వీసు సంస్థలు. తాజాగా ముంబయిలో ఓ ప్రయాణికుడి 50 కి.మీల రైడ్‌కు ఏకంగా రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేలు చూపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కంగుతిన్న ఆ ప్రయాణికుడు తనకు ఎదురైన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో ఇది కాస్త వైరల్‌గా మారిపోయింది. 

అసలేం జరిగిందంటే?

ముంబయికి చెందిన శ్రవణ్‌కుమార్‌ సువర్ణ అనే వ్యక్తి భారీ వర్షం కారణంగా ఇంటికి క్యాబ్‌లో వెళ్లాలనుకున్నాడు. తన మొబైల్‌లోని ఉబెర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి క్యాబ్‌ బుక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 50 కి.మీల ప్రయాణానికి క్యాబ్‌ విధించిన అధిక రేట్లను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఉబెర్​గోలో రూ.3,041లు, ప్రీమియర్​లో రూ. 4,081- ఎక్స్​ఎల్​లో రూ.5,159గా ఛార్జీలను చూపించింది. ఈ రేట్లను చూసి కంగుతిన్న శ్రవణ్‌.. క్యాబ్​ ఛార్జీలకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ.. ‘నా ఇంటికి క్యాబ్​లో వెళ్లే దానికన్నా.. ముంబయి- గోవా విమానం రేట్లు చాలా తక్కువే’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనిపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు పెరిగాయా? 10 కి.మీల మైలేజ్‌ వచ్చినా.. 50 కి.మీకు గరిష్ఠంగా రూ.500 అవుతుంది. కానీ, వాళ్లు దీనికి రెండున్నర రెట్లు ఎక్కువగా బాదుతున్నారు’’ అని పేర్కొనగా.. దీనికి స్పందించిన శ్రవణ్‌ ‘నేనయితే రూ.800-రూ.1000 చెల్లిస్తాను’ అంటూ బదులిచ్చారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని