Flying Car: ఎగిరే కారు.. గంటకు 300KM వేగం!

స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. నిత్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కారు దాదాపు 8 వేల ఎత్తుకు ఎగిరి.. రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది....

Published : 03 Jul 2021 01:17 IST

బ్రాటిస్లావా: స్లొవేకియాలో ఎగిరే కారు ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తయింది. నిత్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కారు దాదాపు 8 వేల ఎత్తుకు ఎగిరి.. రాజధాని బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోయే ఈ కారు.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లగలదు. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారు తయారీకి రెండేళ్ల సమయం పట్టిందని ఆ కారు సృష్టికర్త స్టీఫెన్‌ క్లిన్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని