Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
Cyber crimes: రోజురోజుకీ సైబర్ మోసాలు పెరిగిపోతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు మరింత అప్రమత్తత తప్పనిసరి. ఈ నేపథ్యంలో సైబర్ నిపుణుల కొన్ని సూచనలు మీ కోసం..
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్లు(Smart phones) ప్రతిఒక్కరి జీవితంతో పెనవేసుకుపోయాయి. ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు మళ్లీ పడుకొనే దాకా ఫోన్ చేతిలో ఉండాల్సిందే. ఎవరితో మాట్లాడాలన్నా.. ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా.. ఇలా ఎన్నో ముఖ్యమైన పనుల్ని ఫోన్‌తో ఇంటినుంచే ‘స్మార్ట్’గా చక్కబెట్టేస్తున్నాం.. ఇంటర్నెట్(Internet) వినియోగం పెరగడంతో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో సైబర్ మోసాలూ(Cyber Crimes) అంతే స్థాయిలో పెరుగుతుండటం తీవ్ర కలవరపెడుతోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగానే సైబరాసులు కూడా కొత్త పద్ధతులు అన్వేషిస్తూ అమాయకులను టార్గెట్ చేసుకొని డబ్బును దోచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు. అందుకోసం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ఆన్‌లైన్ మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకొనేందుకు 5s పేరుతో కొన్ని సూచనలు చేస్తూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- Suspicious link alerts: అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి
- Strong and Unique passwords: మీ డివైజ్‌కు స్ట్రాంగ్, యూనిక్ పాస్‌వర్డ్‌లను పెట్టుకోండి
- Secure network: సురక్షితమైన నెట్‌వర్క్‌లను వాడండి
- Secure websites and Apps: సురక్షితమైన వెబ్‌సైట్‌లు, యాప్‌లనే వాడండి
- Software updates: సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి
అలాగే, యూపీఐ పేమెంట్స్ చేసేవారికి కొన్ని జాగ్రత్తలివే..
- నమ్మదగిన యూపీఐ యాప్‌లనే వాడండి
- యూపీఐ ఐడీకి స్ట్రాంగ్ పిన్ పెట్టుకోండి
- UPI పిన్, OTPని ఎవరికీ షేర్ చేయొద్దు
- ప్రతి నెలకోసారి యూపీఐ పిన్‌ను మార్చుకోవాలి.
- అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు
- యూపీఐ యాప్‌ను తరచూ అప్‌డేట్ చేసుకోవాలి
- లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.
యూపీఐ మోసాలకు గురైతే తక్షణమే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం ఉత్తమం. అలాగే, హోంశాఖకు చెందిన https://www.cybercrime.gov.inవెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
చంద్రునిపై ల్యాండర్, రోవర్ నుంచి అందని సంకేతాలు
-
పండగ సీజనులో కొనుగోళ్ల జోరు!
-
సంక్రాంతికి గ్రహాంతర విందు
-
Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ చందాదారులా? అయితే, ఈ విషయం తెలుసా?
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?