Food: ఆహారం జీర్ణం అవ్వట్లేదా! కారణాలు ఇవే కావచ్చు!

చాలామంది నచ్చిన ఆహారాన్ని రుచి చూడాలనుకుంటారు. కానీ ప్రస్తుత జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల జీర్ణ వ్యవస్థ చాలా దెబ్బతింటోంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం కాక అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతోంది. 

Published : 30 Oct 2022 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తిన్న ఆహారం జీర్ణం కాక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మధ్యాహ్నం తిన్న భోజనం ఇంకా జీర్ణం కాలేదని.. రాత్రి సమయంలో తినకుండా పడుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా! అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? కారణాలేంటి! తెలుసుకోండి.

* ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు జీవనశైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో లాభాలతో పాటు నష్టాలూ వెంట వచ్చేశాయి.

* మధ్యాహ్నం భోజనం 12 గంటల నుంచి 2 గంటల లోపే తినేయాలి. ఆలస్యంగా తింటే ఆహారం జీర్ణమవదు. కొంతమంది పనిలో పడి, లేదా బరువు పెరుగుతామనే భయంతో భోజనం చేయటం మానేస్తుంటారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది.

* రాత్రి భోజనం 8 గంటల కల్లా తినేయాలి. తర్వాత కాసేపు నడవాలి. తిన్న వెంటనే నిద్రపోవటం మంచిది కాదు.

* ఉదయం అల్పాహారమైనా, భోజనమైనా సమయానికి తినేయాలి. నిర్ణీత సమయానికి తినడం వల్ల చాలావరకూ సమస్యలను నివారించవచ్చు.

* చాలామంది అర్ధరాత్రి దాటేవరకు సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు వాడుతూ ఉంటారు. దీని వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. 
* జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే ఉదయం గోరు వెచ్చిన నీటిని తాగాలి. ఇందులో తేనె, నిమ్మరసం చేర్చుకుంటే మరిన్ని ప్రయోజనాలుంటాయి. 

* చాలామంది ఎక్కువగా టీ, కాఫీలు తాగుతుంటారు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆహారం తొందరగా జీర్ణమవదు.

* జంక్‌ ఫుడ్‌ను తగ్గించండి. ఇంట్లో వండిన ఆహారాన్నే తినండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని