Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?

వయసులో ఉన్నపుడు రాళ్లను తిన్నా కరిగించుకోవచ్చు. వయసు మళ్లిన తర్వాత రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి. 

Published : 27 Jun 2022 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయసులో ఉన్నపుడు రాళ్లను తిన్నా కరిగించుకోవచ్చు. వయసు మళ్లిన తర్వాత రకరకాల సమస్యలు వెంటాడుతుంటాయి. తరచుగా ఆజీర్తి, గ్యాస్‌ట్రబుల్‌, పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పుల లాంటి బాధలు పెరుగుతుంటాయి. వయసుకు తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వయసు పైబడిన వారు నిత్యం ఏం తినాలో.. ఎలా తినాలో..ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో పోషకాహార నిపుణురాలు అంజలీదేవి పలు సూచనలు చేశారు.

* 60 ఏళ్లు దాటిన తర్వాత ఆహార నియమాలు సరిగా ఉంటే అవే ఔషధాలుగా పని చేస్తాయి. వృద్ధాప్యం 70 ఏళ్ల దాటి పోయినా ఆరోగ్యం ఉన్నా శారీరక మార్పులు మాత్రం జరిగిపోతాయి.

* భోజనంలో ఆకు కూరలు, కూరగాయలు,, పండ్లు సగం పళ్లెం నిండా ఉండాలి. పావువంతు గింజ ధాన్యాలు, ఇంకో పావు భాగంలో మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహార పదార్థాలుండాలి. 

* ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూరను 100 మి.గ్రాములు తీసుకోవాలి. ఇందులో ఇనుము, కాల్షియం ఉంటాయి. 

* పండ్లలో బీ కాంప్లెక్సు ఎక్కువగా ఉంటాయి. నరాల్లో బలం ఉండేందుకు బాగా ఉపయోగపడుతాయి. 

* దుంప కూరలు తక్కువగా తినాలి. గింజ కూరలు తిన్నపుడు వీటిని పూర్తిగా తగ్గించాలి.

* వృద్ధాప్యంలో నాలుకపై రుచి మొగ్గలు తగ్గిపోతాయి. వాసన కూడా సరిగా ఉండదు. ఏ ఆహారం తిన్నా వాసన, రుచి లేకపోవడంతో అసంతృప్తికి లోనవుతారు. 

* విటమిన్‌ డి.కాల్షియం పుష్కలంగా ఉండే పాలు, పాల పదార్థాలు, చేపలు ఎక్కువగా తీసుకోవాలి.

* పెద్దలకు మలబద్దకం సమస్యగా మారుతుంది. రోజువారీ ఆహారంలో పీచు బాగా లభించే పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం ఎక్కువగా తినాలి. 

* ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. డ్రై చేసిన వంటలు తినొద్దు. సమయానుకూలంగా తినాలి. కొద్దిసేపు వ్యాయామం రోజూ చేయాలి.

*  దాహం వేయడం లేదని నీరు తాగకుండా ఉండకూడదు. తరచుగా నీళ్లను తాగుతూ ఉండాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని