Andhra News: కలుషిత ఆహారం తిని 150మంది విద్యార్థినులకు అస్వస్థత

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల విద్యాలయంలో సుమారు 150మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కలుషిత అల్పాహారం తీసుకోవడం వల్ల సుమారు 30మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు.

Updated : 30 Jan 2023 21:23 IST

సత్తెన్నపల్లి గ్రామీణం: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ బాలికల గురుకుల విద్యాలయంలో సుమారు 150మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం కలుషిత అల్పాహారం తీసుకోవడం వల్ల సుమారు 30మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడ్డారు. తర్వాత మధ్యాహ్న భోజనం అనంతరం మరికొందరు వాంతులతో అస్వస్థతకు గురవడంతో పాఠశాల ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు అప్రమత్తమయ్యారు. స్వల్ప జ్వరం, నీరసంతో మరికొందరు బాధపడటంతో మొత్తం 150 మందిని సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ఆర్డీవో రాజకుమారి, డీఎస్పీ ఆదినారాయణ ఆసుపత్రిలోని బాలికలను పరామర్శించారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విద్యాలయంలో మొత్తం 640మంది విద్యార్థినులు చదువుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని