Food Safety Tips: వర్షా కాలంలో ఆరోగ్యం జాగ్రత్త.. ఈ చిట్కాలతో రోగాలకు దూరంగా..!

వర్షా కాలంలో తీసుకొనే ఆహారం విషయంలో పలు జాగ్రత్తలను సూచిస్తూ ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఓ వీడియో విడుదల చేసింది.

Updated : 09 Jul 2024 16:58 IST

Heath Tips| ఇంటర్నెట్‌ డెస్క్‌: అసలే ఇది వర్షాకాలం (Monsoon).. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినా.. అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే కాలం. పరిశుభ్రత విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇక అంతే. డయేరియా, కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం, వాంతులు, వివిధ రకాల ఫ్లూలు వంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అపరిశుభ్రమైన ఆహారపు అలవాట్లు, నీరు, కలుషితాహారమే ఈ సమస్యలకు దారితీస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని పదిలంగా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొనేలా ఫుడ్‌సేఫ్టీ అథారిటీ వర్షాకాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలతో (Food Safety Tips)  ఓ వీడియో విడుదల చేసింది. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ చిట్కాలు మేలు చేస్తాయి.

  • వంట చేసే ముందు మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు, కాయగూరల్ని బాగా కడగాలి.
  • మీ పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. చేతుల్ని తరచూ సబ్బు, నీళ్లతో కడుక్కోవాలి. వంట చేసే ముందు, తినే ముందు చేతులు కడగడం అలవాటు చేసుకోండి.
  • వంటకు మంచి నీటినే వినియోగించండి. ఫిల్టర్ చేయని లేదా అపరిశుభ్రంగా ఉండే నీటి వాడకం ఆరోగ్యానికి ముప్పు.  
  • తాజాగా వండిన ఆహారాన్నే తీసుకోండి. మీకు అవసరమైనంత మాత్రమే ఫుడ్‌ సిద్ధం చేసుకోండి. ఎక్కువ ఆహారం వండి నిల్వ చేసి తినడం ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ.
  • సూక్ష్మ జీవుల పెరుగుదలను నివారించేందుకు మిగిలిన ఆహారాన్ని చల్లబడిన వెంటనే రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోండి.
  • పాలు, పెరుగు వంటి పదార్థాలను ఎప్పుడూ రిఫ్రిజిరేటర్‌లోనే ఉంచండి.
  • తాజాగా ఉండే, స్థానిక ఆహార ఉత్పత్తులనే ఉపయోగించడం చాలా మేలు. ఫ్రెష్‌ ఫుడ్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి.
  • మీరు తీసుకొనే ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, కొత్తిమీర, పసుపు ఉండేలా చూసుకోండి. ఇవి మీ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఎంతో సహకరిస్తాయి. తద్వారా వర్షాకాలంలో రోగాలు దరిచేరకుండా రక్షణ కల్పిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు