చెట్లకూ ఓ దవాఖానా!
మనుషుల దవాఖానా తెలుసు.. జంతువుల దవాఖానా తెలుసు.. ఈ చెట్ల దవాఖానా ఎంటని ఆశ్చర్యంగా ఉందా?మనుషులు.. జంతువులతోపాటు చెట్లకూ ప్రాణముంటుంది.. మరి వాటి ప్రాణాలు కాపాడటానికి ఆస్పత్రి ఉండాలి కదా! అందుకే పంజాబ్‌కు చెందిన ఓ ఐఆర్‌ఎస్
ఇంటర్నెట్ డెస్క్: మనుషుల దవాఖానా తెలుసు.. జంతువుల దవాఖానా తెలుసు.. ఈ చెట్ల దవాఖానా ఏంటని ఆశ్చర్యంగా ఉందా?మనుషులు.. జంతువులతోపాటు చెట్లకూ ప్రాణముంటుంది.. మరి వాటి ప్రాణాలు కాపాడటానికి ఆస్పత్రి ఉండాలి కదా! అందుకే పంజాబ్‌కు చెందిన ఓ ఐఆర్‌ఎస్ అధికారి ఏకంగా తన ఇంట్లోనే చెట్ల ఆస్పత్రిని ప్రారంభించాడు. తన పరిసర ప్రాంతాల్లో ఏ చెట్టు అనారోగ్యానికి గురైనా దానికి ఔషధాలు ఇచ్చి బాగు చేస్తున్నాడు. అత్యవసర సేవల కోసం అంబులెన్స్ సైతం ఏర్పాటు చేయడం విశేషం.
ఆయన.. గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా
అమృత్‌సర్‌లో నివసించే రోహిత్ మెహ్రా దేశానికి సుపరిచితమే. ఇప్పటి వరకు ఆయన దేశవ్యాప్తంగా అనేక చోట్ల మొక్కలను నాటించి.. వాటిని సంరక్షించి 75 అడవులను సృష్టించాడు. ఒక్కో అటవీప్రాంతం విస్తీర్ణం 2వేల చదరపు అడుగుల నుంచి 66వేల చదరపు అడుగుల వరకు ఉంటుంది. అంతేకాదు.. దేశంలో వర్టికల్ గార్డెన్స్(గోడలపై నిలువు వరుసలో చెట్ల పెంపకం)ను ప్రోత్సహిస్తున్నాడు. అందుకే ఆయన్ను ‘గ్రీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తుంటారు.
ఇళ్లలో పెంచుకునే చెట్ల కోసం..
ఇళ్లలో మనం పెంచుకునే చెట్లకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. తెగులు పట్టడం, కాండం తొలచడం వంటి వ్యాధులు సోకుతుంటాయి. దీంతో వాటి పెరుగుదల తగ్గిపోతుంది. వ్యవసాయ క్షేత్రాల్లో అయితే వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు పరిష్కారాలు చూపుతారు. మరి సాధారణంగా ఇళ్లలో పెంచుకునే చెట్ల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారు? ఈ ఆలోచనతోనే రోహిత్ మెహ్రా చెట్ల ఆస్పత్రిని ప్రారంభించాడు. ప్రజలు వారి ఇళ్లలో పెంచుకునే చెట్లకు ఎలాంటి వ్యాధులు సోకినా.. తనను సంప్రదిస్తే చెట్లకు చికిత్స చేసి నయం చేస్తున్నాడు. అత్యవసరమైతే తాను ఏర్పాటు చేసుకున్న అంబులెన్స్‌లో వెళ్లి సేవలందిస్తాడు.
వృక్షాయుర్వేదం.. మియవాకి పద్ధతిలో వైద్యం
రెవెన్యూ ఆఫీసర్ అయిన రోహిత్ చెట్ల పంపకం.. వాటి వ్యాధులకు తగిన చికిత్స కోసం వృక్షశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. వృక్షాలకు సంబంధించిన వృక్షాయుర్వేద సహా అనేక ప్రాచీన పుస్తకాలు చదివాడు. అలాగే చెట్ల రోగాలను నయం చేసేందుకు జపనీయులు ఉపయోగించే మియవాకి అనే పద్ధతి గురించి తెలుసుకున్నాడు. అయినా.. చెట్లకు చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆధునిక వృక్షశాస్త్ర నిపుణుల సలహాలు సూచనలు తీసుకుంటాడు.
ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా.. వర్టికల్ గార్డెన్స్
గతంలో రోహిత్ ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్స్ లూధియానా ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్లాస్టిక్ బాటిళ్లను పారేయకుండా.. వాటిలో మట్టి నింపి, మొక్కలు నాటి గోడ నిండా పేర్చేవాడు. రోహిత్ ఆలోచన నచ్చి లూధియానా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, చర్చ్‌లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేస్టేషన్లలో ఈ వర్టికల్ గార్డెన్స్ ఏర్పాటు అయ్యాయి. ప్రస్తుతం రోహిత్ ఈ చెట్ల ఆస్పత్రిపై దృష్టి పెట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. -
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వచ్చాయి. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Nagarjuna sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏపీ పోలీసులు అర్ధరాత్రి నాగార్జున సాగర్ వద్దకు చేరుకొని ఎస్పీఎఫ్ పోలీసులపై దాడి చేశారు. డ్యామ్‌పై విద్యుత్ సరఫరా నిలిపివేసి, అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. -
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ కొత్త పోర్టల్‌ను ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Telangana assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. సినీ తారల ఫన్నీ మూమెంట్స్
-
Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్‌గా ద్రవిడ్ కొనసాగింపుపై గంభీర్ స్పందన
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు