TG news: రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి

రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

Published : 02 Jul 2024 22:00 IST

హైదరాబాద్‌: రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని జూన్‌ 22న మంత్రివర్గం నిర్ణయించింది. ఆ మేరకు రైతు భరోసా మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎంపిక చేసింది. కమిటీలో సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. రైతు భరోసా విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని