Andhra news: ఐబీ సిలబస్‌ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు

ఏపీలో ఐబీ సిలబస్‌ విధివిధానాల రూపకల్పనకు అక్కడి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది.

Updated : 25 Sep 2023 23:16 IST

అమరావతి: ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ బోర్డులో అంతర్జాతీయ స్థాయి (ఇంటర్నేషనల్ బాక్యులరేట్-ఐబీ) సిలబస్ అమలు, రోడ్ మ్యాప్‌, మార్గదర్శకాల కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, ఇంటర్ విద్యాశాఖ కమిషనర్‌ల నేతృత్వంలో రెండు వర్కింగ్ గ్రూప్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నేషనల్‌ బాక్యులరేట్‌ సిలబస్‌ అమలు, తరగతుల నిర్వహణ, సర్టిఫికేషన్ వంటి అంశాలపై ఈ కమిటీలు విధివిధానాలను రూపొందించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని