Koppula Harishwar Reddy: పరిగి ఎమ్మెల్యే తండ్రి, మాజీ ఉపసభాపతి కన్నుమూత

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డి తండ్రి, మాజీ ఉప సభాపతి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. 

Updated : 23 Sep 2023 00:48 IST

పరిగి: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్‌రెడ్డికి పితృవియోగం. ఆయన తండ్రి, మాజీ ఉప సభాపతి (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (78) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హరీశ్వర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పరిగి నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014లో భారాసలో చేరారు. 

హరీశ్వర్‌రెడ్డి కన్నుమూయడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌రెడ్డి చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని