Andhra news: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురు

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది.

Updated : 25 Jun 2024 22:39 IST

అమరావతి: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హయగ్రీవ సంస్థ భూముల వ్యవహారంలో వైకాపా మాజీ ఎంపీపై ఆరిలోవ ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కేసును కొట్టేయాలని హైకోర్టులో ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం కేసు ఎఫ్‌ఐఆర్‌ దశలో ఉన్నందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని సూచించింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 

వైకాపా మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపైనా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 22న పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని