బుద్ధదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత
గత వారం కరోనా బారిన పడిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(77) తీవ్ర అస్వస్థతతో కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు.
గతవారం కరోనా బారిన పడిన బెంగాల్ మాజీ సీఎం
ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో అసుపత్రిలో చేరిక
కోల్‌కతా: గతవారం కరోనా బారిన పడిన పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(77) తీవ్ర అస్వస్థతతో కోల్‌కతాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ స్థాయి 90 శాతం కన్నా దిగువకు పడిపోవడంతో వైద్యుల సూచన మేరకు ఆయన్ను మంగళవారం ఆసుపత్రిలో చేర్చారు. మే 18న కరోనా సోకడంతో బుద్ధదేవ్ తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆలస్యం చేయకుండా చికిత్స అందించేందుకు ఆయన్ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్టు వైద్యులు వివరించారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఆయన ఇతర వైద్య పరీక్షల కోసం కూడా ఆసుపత్రికి వెళ్లాల్సి ఉన్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కానీ కొవిడ్ సోకినప్పటి నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు ఆయన సుముఖంగా లేరు. ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం గతవారం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరారు. సోమవారం నెగెటివ్‌గా తేలడంతో ఆమెను డిశ్చార్జి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
31లోగా ఇవి పూర్తి చేయండి..
-
నిగ్గదీయొద్దు.. నోరు మెదపొద్దు: వైకాపా నేతను కాపాడేందుకు ఎన్ని ఆపసోపాలో!
-
ఒకప్పటి క్రిప్టో కింగ్ శామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
-
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!