45% ఒంటరితనం అనుభవించారు

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, నగరాల్లో నివసించే భారతీయుల్లో ప్రతి పది మందిలో నలుగురు(మొత్తంగా 45శాతం మంది) ఒంటరితనాన్ని

Updated : 22 Mar 2021 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా.. మానసికంగా కుంగిపోయిన విషయం తెలిసిందే. అయితే, నగరాల్లో నివసించే భారతీయుల్లో ప్రతి పది మందిలో నలుగురు(మొత్తంగా 45శాతం మంది) ఒంటరితనాన్ని అనుభవించారని ఇప్సోస్‌ అనే సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. 28శాతం పట్టణ ప్రజలు కుంగుబాటుకు గురయ్యారట. అయితే, మరికొంత మంది మాత్రం కరోనా చీకట్లోనూ సానుకూల దృక్పథాన్ని చూశారని సర్వేలో తేలింది.

‘‘నిత్యం కాలనీల్లో ఇరుగుపొరుగువారితో, ఆఫీసుల్లో సహోద్యోగులతో సరదాగా మాట్లాడుకుంటూ, కలిసి మెలిసి ఉండే ప్రజలకు కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌, ఆంక్షలు కొత్తరకం ఒంటరితనాన్ని రుచిచూపించాయి. బలవంతంగా ఏకాంత సమయాన్ని ఇచ్చింది. దీంతో చాలా మంది ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది. అయితే కొందరు మాత్రం ఏకాంతాన్ని తరిమేయడానికి అనేక మార్గాలు వెతుక్కున్నారు. ఇంటర్నెట్‌ను ఆశ్రయించి ఆన్‌లైన్‌లో బంధువులతో మాట్లాడుకోవడం, గేమ్స్‌ ఆడుకోవడం, సోషల్‌మీడియా, ఓటీటీ చూడటం ఇలా డిజిటల్‌ సంతోషాన్ని పొందారు. మరికొంత మంది ఇంట్లోనే కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం.. వారికి సాయం చేయడం వంటివి చేశారు’’అని ఇప్సోస్‌ ఇండియా తెలిపింది. 

మరోవైపు కరోనా సంక్షోభంలో తమ కాలనీల్లో ఇరుగు పొరుగున ఉండే వ్యక్తుల నుంచి అన్ని రకాలుగా మద్దతు లభించదని 50శాతం పట్టణ ప్రజలు చెప్పినట్లు ఇప్సోస్‌ తెలిపింది. సౌదీ అరేబియాలో ఇది 51శాతంగా, చైనాలో 55శాతంగా ఉందని, రష్యాలో 13శాతం, జపాన్‌లో 10శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. డిసెంబర్‌ 2020 నుంచి జనవరి 2021 మధ్య వివిధ దేశాల్లోని నగరాల్లో ఉన్న కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని