జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో..

Updated : 13 Jun 2021 18:19 IST

జమ్ము: జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో జమ్మూ సమీపంలోని మజీన్‌ గ్రామంలో 62 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణాన్ని తితిదే చేపడుతోంది. తితిదే వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, తితిదే పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని