ఐస్‌లాండ్‌లో‌ బద్దలైన అగ్నిపర్వతం..

ఐస్‌లాండ్‌ రాజధాని రేకియావిక్‌కు సమీపంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. భగభగ మండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్ధలైనట్లు ఆ దేశ వాతావరణ విభాగం ధ్రువీకరించింది....

Updated : 20 Mar 2021 14:28 IST

రేకియావిక్‌: ఐస్‌లాండ్‌ రాజధాని రేకియావిక్‌కు సమీపంలో భారీ అగ్ని పర్వతం బద్దలైంది. భగభగ మండుతూ లావాను వెదజల్లుతోంది. శుక్రవారం రాత్రి ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆ దేశ వాతావరణ విభాగం ధ్రువీకరించింది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న లావా విస్ఫోటనాన్ని తలపిస్తోంది. ఆకాశంలోని మేఘాలు ఎరుపు వర్ణాన్ని తలపిస్తున్నాయి. అగ్నిపర్వతం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. అగ్నిపర్వతం బద్దలైన ప్రాంతం సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు ఐస్‌లాండ్‌ అధికారవర్గాలు వెల్లడించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని