Vskp-Sec Vande Bharat: ఈ నెల 10న నాలుగు గంటలు ఆలస్యంగా వందేభారత్‌

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది.

Updated : 09 Jun 2023 22:24 IST

విశాఖపట్నం: ఈ నెల 10న విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 5.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరాల్సిన 20833 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఉదయం 9.45 గంటలకు రైలు బయలుదేరనున్నట్లు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు