Waterspouts: ఆకాశానికి ధార కట్టిన సంద్రం! వైరల్‌గా మారిన వీడియో!

సముద్ర ఒడ్డుకు కొట్టుకు వచ్చే అలలు చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా! అలాంటిది సంద్రంలోని నీరు ఒక్కసారిగా ఆకాశానికి ధార కడితే ఎలా ఉంటుంది.

Published : 18 Sep 2022 15:34 IST

మాడ్రిడ్‌: సముద్ర ఒడ్డుకు కొట్టుకు వచ్చే అలలు చూసేందుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా! అలాంటిది సముద్రంలోని నీరు ఒక్కసారిగా ఆకాశానికి ధార కడితే ఎలా ఉంటుంది. ఊహకే అందడం లేదు కదా! స్పెయిన్‌కు చెందిన మల్కోరా ప్రాంతంలో ఇలాంటి వింత ఘటన జరిగింది. టోర్నాడో ప్రభావంతో అక్కడి  సముద్ర ఉపరితలంలో భారీ ఎత్తులో నాలుగు  టోర్నాడోలు ఏర్పడ్డాయి. అసాధారణంగా ఏర్పడే ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 7లక్షలకు పైగా మంది వీక్షించారు. 15వందల మంది లైక్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని