Andhra News: కవిటి మండలంలో విషాదం.. 40 కోతులు మృతి, అపస్మారక స్థితిలో మరికొన్ని

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కవిటి మండలం శిలాగం గ్రామ సమీపంలోని రహదారిపై 40 కోతుల మృతదేహాలు పడిఉండటం కలకలం రేపింది.

Updated : 25 Oct 2022 17:12 IST

కవిటి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. శిలాగం గ్రామ సమీపంలోని రహదారిపై 40 కోతుల మృతదేహాలు పడిఉండటం కలకలం రేపింది. రోడ్డు పక్కన తోటలో అపస్మారక స్థితిలో మరికొన్ని కోతులు పడి ఉన్నాయి. అపస్మారక స్థితిలో ఉన్న కోతులకు స్థానికులు బిస్కెట్లు, రొట్టెలు, నీళ్లు అందించారు. కోతులపై విషప్రయోగం జరిగిందా? లేక విద్యుదాఘాతంతో మృతి చెందాయా? అని స్థానికులు అనుమానిస్తున్నారు. కోతుల మృతదేహాలను పరీక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి బయలుదేరారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే కోతుల మృతికి కారణాలు తెలుపుతామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని