Factcheck: ఈసారి టాటా సఫారీ అంట.. క్లిక్కారా?

సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మొన్నా మధ్య అమెజాన్‌ 30వ వార్షికోత్సవం అన్నారు. కొద్ది రోజుల క్రితం రంగు రంగుల వాట్సాప్‌ అంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో లింకులు షేర్‌ చేశారు. ఇప్పుడు టాటా సఫారీ వంత......

Updated : 07 Jun 2021 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. మొన్నా మధ్య అమెజాన్‌ 30వ వార్షికోత్సవం అన్నారు. కొద్ది రోజుల క్రితం రంగు రంగుల వాట్సాప్‌ అంటూ వాట్సాప్‌ గ్రూపుల్లో లింకులు షేర్‌ చేశారు. ఇప్పుడు టాటా సఫారీ వంతు వచ్చింది. 30 మిలియన్ల యూనిట్ల కార్లు విక్రయమైన నేపథ్యంలో టాటా మోటార్స్‌ గ్రూప్‌ టాటా సఫారీని ఉచితంగా అందిస్తోందన్నది ఆ మెసేజ్‌ సారాంశం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ పలు వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది.

ఇప్పుడు అసలు విషయానికొద్దాం. టాటా కంపెనీ అటువంటి అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు. పైగా ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే టాటా మోటార్స్‌ పేజీకి కాకుండా వేరే పేజీకి వెళుతోంది. అక్కడ నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని చెబుతున్నారు. ఆ తర్వాత గిఫ్ట్‌ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని కోరుతున్నారు. అంటే మీరే స్వయంగా ఐపీ అడ్రస్‌తో సహా మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతులో పెడుతున్నారన్నమాట! అలాగే, అక్కడ చాలా మంది తమకు కారు వచ్చినట్లు కామెంట్లు కూడా పెట్టారు. ఆ ఐడీలను ఒకసారి పరిశీలిస్తే అవన్నీ నకిలీ ఖాతాలని ఇట్టే అర్థమైపోతుంది. కాబట్టి ఇలాంటి లింకులను షేర్‌ చేయొద్దు. ఒకవేళ మీకూ అలాంటి లింక్‌ వస్తే దాని జోలికి పోవద్దు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని