DGP: పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచిత శిక్షణ: డీజీపీ

పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈమేరకు కమిషనరేట్లు

Updated : 10 Mar 2022 04:58 IST

హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈమేరకు కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వాళ్లను చైతన్యపర్చాలని డీజీపీ తెలిపారు. గత ఏడేళ్లుగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో యువతకు.. పోలీస్‌ అధికారులు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతి కూడా కల్పిస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన యువతీ యువకులు ఈ శిక్షణా శిబిరాలను ఉపయోగించుకొని పోలీసు ఉద్యోగాలు సాధిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో మహేందర్‌రెడ్డి శిక్షణా శిబిరాలు నిర్వహించారు. డీజీపీ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని