Black fungus: ఏపీలో ఉచిత వైద్యం!

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందించనున్నట్టు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. దీనిపై

Updated : 15 Aug 2022 15:48 IST

అమరావతి: బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం అందించనున్నట్టు ఏపీ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. దీనిపై త్వరలోనే జీవో ఇస్తామని స్పష్టంచేశారు. బ్లాక్‌ ఫంగస్‌ను మొదట్లోనే గుర్తిస్తే త్వరగా నయం చేయవచ్చన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు తొమ్మిది మందికి బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్టు చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల గురించి ప్రైవేటు ఆస్పత్రులు సమాచారం ఇవ్వాలని కోరారు. దీని చికిత్సకు ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని