తరచూ జలుబుతో కొవిడ్‌ నుంచి రక్షణ!

సీజన్‌ మారినప్పుడల్లా మనకు జలుబు చేయటం సాధారణమే. అయితే తరచూ జలుబు చేయటమూ మంచిదేనట! ఆ జలుబు.. రైనో, పారా ఇన్‌ప్లుయోంజా వంటి వాటిలానే కొన్ని రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా రావొచ్చు. అలాంటి జలుబు వల్ల శరీరంలో పెరిగే రోగ నిరోధక శక్తి

Published : 17 Dec 2020 09:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీజన్‌ మారినప్పుడల్లా చాలామందికి జలుబు చేయటం సాధారణమే. అయితే అలా అవ్వడం మంచిదేనట! ఆ జలుబు.. రైనో, పారా ఇన్‌ప్లుయోంజా వంటి వాటిలానే కొన్ని రకాల కరోనా వైరస్‌ల వల్ల కూడా రావొచ్చు. అలాంటి జలుబు వల్ల శరీరంలో పెరిగే రోగ నిరోధక శక్తి కారణంగా కొవిడ్‌ వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ రోచెస్టర్‌ మెడికల్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు కొన్నిసార్లు జీవితాంతం కొవిడ్‌ నుంచి రక్షణ లభించే అవకాశమూ ఉందట. అదెలా అంటే... 

గతంలో కరోనా వైరస్‌ కారణంగా జలుబు చేసిన రోగుల్ని పరిశీలించినపుడు ఆసక్తికర విషయం బయటికొచ్చింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థలోని మెమొరీ బి కణాలు వైరస్‌లను గుర్తు పెట్టుకుంటాయట. దాంతో ఆ రకమైన వైరస్‌లు మళ్లీ శరీరంలోకి ప్రవేశించగానే ఈ మెమొరీ బి కణాలు స్పందించి యాంటీ బాడీలను విడుదల చేస్తున్నాయట. ఈ కణాలు దశాబ్దాల తరబడి శరీరంలో జీవించి ఉంటాయి. ఫలితంగా గతంలో ఇతరత్రా కరోనా వైరస్‌ల కారణంగా జలుబు చేసిన వాళ్లకి అంత త్వరగా కొవిడ్‌ రాకపోవచ్చు. ఒకవేళ కొవిడ్‌ వచ్చినా వాళ్ల మీద అంతగా ప్రభావాన్ని చూపించకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని