Palnadu: పోస్టుమార్టానికీ లంచం !.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
పోస్టుమార్టం చేసేందుకు వైద్యులు రూ.5 వేలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆందోళనకు దిగిన ఘటన పల్నాడు జిల్లా గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద శుక్రవారం జరిగింది.
గురజాల: పోస్టుమార్టం నిర్వహించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారని ఆరోపిస్తూ పల్నాడు జిల్లా గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. బంధువుల ఆందోళనతో దిగి వచ్చిన వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా గురజాల పట్టణానికి చెందిన రాజవరపు ఈశ్వర్ (25) అనే యువకుడు దాచేపల్లి మండలంలోని రైల్వే బ్రిడ్జి దగ్గర గురువారం రాత్రి 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం బంధువులు మృతదేహాన్ని గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు రూ.5 వేలు డిమాండ్ చేయడంతో అందుకు బంధువులు నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలైనా వైద్యులు మృతదేహాన్ని అప్పగించలేదు. డబ్బులు ఇస్తేనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని వైద్యులు, సిబ్బంది భీష్మించుకోవడంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)
-
Rahul Gandhi: నేను చెప్పింది మోదీ అంగీకరించారు: రాహుల్ గాంధీ
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Shashi Tharoor: తిరువనంతపురం పేరు.. ‘అనంతపురి’ పెడితే బాగుండేది..!