14 ఏళ్ల నుంచి 24ఏళ్లకు రెండు నిముషాల్లో.. 

కాలంలో ప్రయాణం అనతగ్గ ఓ వ్యక్తి ప్రయత్నం నెట్టింట్లో ఎందరినో ఆకర్షిస్తోంది.

Updated : 08 Jan 2021 04:32 IST

పదేళ్లుగా రోజూ సెల్ఫీ.. చివరికిలా: వైరల్‌ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: కాలంలో ప్రయాణం అనే భావన చాలా విచిత్రమైనది. కాలంలో ప్రయాణించే యంత్రాలను తయారు చేయాలని కొన్ని వందల సంవత్సరాల నుంచీ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఐతే అంత అవస్థ ఎందుకు.. పాత ఫొటోలను, వీడియోలను చూస్తే కాలంలోకి తొంగి చూసినట్టే కదా అని మరికొంత మంది అభిప్రాయం. ఇదిలా ఉండగా.. కాలంలో ప్రయాణం అనదగ్గ ఓ వ్యక్తి ప్రయత్నం నెట్టింట్లో ఎందరినో ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

నియాల్‌ గ్రే అనే ఈ యువకుడు గత పదేళ్లుగా తన ప్రతిరోజూ తన సెల్ఫీ తీసుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం 24 ఏళ్ల వయస్సులో వాటన్నిటినీ జతచేసి రెండు నిముషాలకు పైగా సాగే అద్భుతమైన టైమ్‌లాప్స్‌ వీడియోను రూపొందించాడు. సామాజిక మాధ్యమాల్లో దానిని షేర్‌ చేస్తూ.. ‘‘ఇదిగో పద్నాలుగేళ్ల వయసులో నేను. గత పది సంవత్సరాలుగా ప్రతిరోజూ నేను సెల్ఫీ తీసుకుంటూనే ఉన్నా.. ’’ అంటూ తెలిపాడు. కాగా 14 ఏళ్ల టీనేజర్‌గా ఉన్నప్పటి నుంచీ 24 ఏళ్ల యువకుడిగా మారటాన్ని ఈ వీడియోలో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ప్రయత్నిస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. అదిసరే గానీ.. ఉంగరాల జుత్తు ఎలా వచ్చిందీ అంటూ మరికొంత మంది ఎంక్వైరీ చేస్తున్నారు. మరి నియాల్‌ 14 నుంచి 24కు రెండు నిముషాల్లో ఎలా మారాడో.. ఈ వీడియోలో మీరూ చూడండి!

 ఇవీ చూడండి..

 రెండు వేల ఏళ్ల నాటి ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌!

2020 మీమ్స్‌: మరోసారి నవ్వుకుందామా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని