Health: అందాన్ని పెంచే ఈ జ్యూస్‌లను తాగుతున్నారా!

మనకు అందుబాటులోనే ఉండే కూరగాయలు, పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అన్ని కూరగాయలు, పండ్లు తినాలని పెద్దలు చెబుతుంటారు.

Published : 26 Sep 2022 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనకు అందుబాటులోనే ఉండే కూరగాయలు, పండ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అన్ని కూరగాయలు, పండ్లు తినాలని పెద్దలు చెబుతుంటారు. కొన్ని కూరగాయలు, పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. అయితే వీటిని తినడానికి బదులు జ్యూస్‌లుగా చేసుకొని నేరుగా తాగేయచ్చు.

* క్యారెట్‌..

క్యారెట్లో ఉండే విటమిన్‌  ‘ఎ’ చర్మ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీంతో పాటు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ జ్యూస్‌ని తరచూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 

టమాట.. 

టమాటలో ఉండే లైకోపిన్‌ అతినీల లోహిత కిరణాల నుంచి చర్మం పాడవకుండా కాపాడుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది.

* నిమ్మరసం..

నిమ్మజాతి పండ్లలో ‘సి’ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిని తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మం మీద ఏర్పడే మచ్చలు తగ్గుతాయి.

* కలబంద...

కలబంద సాధారణంగా కురుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని వాడుతుంటారు. దాంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. సహజ సిద్ధంగా లభించే కలబందను (అలో వెరా) జ్యూస్‌ చేసుకుని తాగితే చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతుంది. 

 * బొప్పాయి..

బొప్పాయి ఆరోగ్యానికి, అందానికి మంచి నేస్తం. హానికరమైన సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఒక గ్లాసు బొప్పాయి రసాన్ని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 
 

* నారింజ..

విటమిన్ ‘సి’ పుష్కలంగా లభించే ఈ నారింజ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్యాన్ని దరి చేరనివ్వదు. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు.   

* అరటిపండు..

అరటిపండులో విటమిన్‌ ఈ, సీ మెండుగా ఉంటాయి. ఈ విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. వీటిని నేరుగానైనా తీసుకోవచ్చు. జ్యూస్‌ చేసుకుని తాగవచ్చు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని