సైనిక లాంఛనాలతో వీర జవాన్ అంత్యక్రియలు
కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య
బాపట్ల: కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో గురువారం అర్ధరాత్రి ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ జశ్వంత్‌రెడ్డి (23) అంత్యక్రియలు ముగిశాయి. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంలో తండ్రి శ్రీనివాస్‌రెడ్డి జశ్వంత్‌రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. గౌరవ సూచికంగా సైనికులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. జశ్వంత్‌రెడ్డి అమర్‌రహే అంటూ నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం మంత్రి సుచరిత, ఉపసభాపతి కూన రఘుపతి పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రకటించిన రూ.50 లక్షల సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అంత్యక్రియల్లో భారీ ఎత్తున జనం పాల్గొని ‘జై జవాన్’ అంటూ నినాదాలు చేశారు. జశ్వంత్‌రెడ్డి పార్థివదేహాన్ని శుక్రవారం ప్రత్యేక విమానంలో హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సీనియర్ మిలిటరీ, ఎయిర్‌ఫోర్స్, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు నివాళులర్పించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు.
మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా
సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్‌పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ