Maoist Leader RK: తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (60) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అర్కే అంత్యక్రియల ఫోటోలను మావోయిస్టు పార్టీ విడుదల

Published : 17 Oct 2021 01:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (60) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అర్కే అంత్యక్రియల ఫోటోలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్‌- తెలంగాణ సరిహద్దులోని పామేడు-కొండపల్లి  ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 2గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈకార్యక్రమానికి మావోయిస్టులు భారీగా హాజరయ్యారు. మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులర్పించారు. 

గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆర్కే తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో గురువారం ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జరిపిన చర్చలకు  ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని